బాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు రాజ‌త్ ముఖ‌ర్జీ మృతి

19-07-2020 Sun 13:25
  • కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజత్
  • జైపూర్‌లోని త‌న‌ నివాసంలో తుది శ్వాస
  • బాలీవుడ్ ప్రముఖుల సంతాపం  
Rajat Mukherjee Passes Away

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ద‌ర్శ‌కుడు రాజ‌త్ ముఖ‌ర్జీ  మృతి చెందారు. గ‌త కొంత‌కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో జైపూర్‌లోని త‌న‌ నివాసానికే పరిమితమై చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన రోడ్, ప్యార్ తునే క్యా కియా, ల‌వ్ ఇన్ నేపాల్‌ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.    

ద‌ర్శ‌కుడు రాజ‌త్ ముఖ‌ర్జీ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజత్‌ ఇక లేడ‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని న‌టుడు మ‌నోజ్ భాజ్‌పాయ్ చెప్పారు. ఈ ఏడాది బాలీవుడ్‌కు వరుసగా విషాద వార్తలు అందుతున్నాయి. రిషి క‌పూర్‌, ఇర్ఫాన్ ఖాన్‌, స‌రోజ్ ఖాన్‌, వాజిద్ ఖాన్‌, జ‌గ‌దీప్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.