Annabathuni Sivakumar: తెనాలి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Tenali YSRCP MLA Annabathuni Sivakumar tested corona positive
  • కరోనా బారినపడిన అన్నాబత్తుని శివకుమార్
  • ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడి
  • అందరికీ ఫోన్ లో అందుబాటులో ఉంటానన్న ఎమ్మెల్యే
ఏపీలో సామాన్యులే కాదు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అనేకమంది వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయనకు ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ మధ్యాహ్నం ఫలితం వచ్చింది. ఎమ్మెల్యేకి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.

దీనిపై ఎమ్మెల్యే శివకుమార్ స్పందిస్తూ, ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. తాను అందరికీ ఫోన్ లో అందుబాటులోనే ఉంటానని వెల్లడించారు. అవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని, కరోనా పట్ల నిర్లక్ష్యం కూడదని పిలుపునిచ్చారు. తెనాలిలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ సహా అనేకమంది అధికారులు, పోలీసులు కరోనా బారినపడడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Annabathuni Sivakumar
Corona Virus
Positive
MLA
Tenali
YSRCP

More Telugu News