East Godavari District: జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో కఠినంగా అమలవుతున్న 24 గంటల కర్ఫ్యూ

  • జిల్లాలో ఇకపై ప్రతి ఆదివారం కర్ఫ్యూ
  • కేసులు పెరుగుతుండడంతో కలెక్టర్ ఆదేశం
  • నిబంధలను అతిక్రమించిన వారిపై చర్యలు
24 hours curfew in East Godavari Dist to curb Coronavirus

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం నేడు 24 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేస్తోంది. జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో కొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఇకపై ప్రతి ఆదివారం జిల్లాలో కర్ఫ్యూ అమలు చేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఆరు గంటలకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. ముఖ్యంగా కాకినాడ, అమలాపురం, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట ప్రాంతాలు పూర్తిగా బోసిపోయాయి. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకుంటున్న పోలీసులు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

More Telugu News