పదో తరగతి చదివి.. హైదరాబాద్‌లో డాక్టర్‌లా వైద్యం చేస్తోన్న యువకుడు

19-07-2020 Sun 12:03
  • మెహిదీపట్నంలో ఘటన
  • ముజిబ్‌ అనే నకిలీ డాక్టర్ అరెస్టు
  • బయటపడిన నకిలీ డాక్టర్ల వ్యవహారం
police arrests fake doctor

పదో తరగతి వరకు చదివి డాక్టర్‌లా పోజులిస్తూ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నాడు ఓ యువకుడు. చివరకు అతడి గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే...  హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ మోసం బయట పడింది. అక్కడి ఓ ప్రాంతంలో షోహెబ్ అనే వ్యక్తి ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అతడి ఆసుపత్రిలోనే ‌ ముజిబ్‌ అనే నకిలీ డాక్టర్ రోగులకు వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు.

అతడు ఎంబీబీఎస్ చదవలేదని గుర్తించిన కొందరు ఇచ్చిన సమాచారం మేరకు అసిఫ్‌నగర్‌ పోలీసులు ఆ ఆసుపత్రిపై దాడులు చేశారు. ముజిబ్‌తో పాటు అతడిని పనిలో పెట్టుకున్న షోహెబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారికి వైద్యుడిగా నకిలీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరికొంత మంది నకిలీ డాక్టర్ల వ్యవహారం కూడా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.