mahabubnagar: తన వివాహేతర సంబంధం గురించి చర్చించుకుంటున్న గ్రామస్థులు.. ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగిన వివాహిత

woman Suicided with lover in Mahabubnagar
  • మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
  • వరుసకు అల్లుడైన వ్యక్తితో వివాహేతర సంబంధం
  • విషయం బయటపడుతుందని ఆత్మహత్య
తన వివాహేతర సంబంధం గురించి ఊర్లోని పదిమందీ చర్చించుకుంటుండడంతో విషయం తన భర్తకు ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడిన ఓ వివాహిత ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  బౌసింగ్‌ తండా గ్రామపంచాయతీ పరిధిలోని వంపుతండాకు చెందిన దేవమ్మ (30), రాజు భార్యాభర్తలు. పదేళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసకు అల్లుడైన అదే తండాకు చెందిన శివనాయక్ (22)తో దేవమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

విషయం ఆ నోటా ఈ నోటా పడి తండా మొత్తం పాకడంతో చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో విషయం తన భర్తకు తెలిసిపోతుందని దేవమ్మ భయపడింది. దీంతో శుక్రవారం రాత్రి కొన్నూరు క్రాస్ రోడ్డు వద్ద పెద్దతొక్కుడోని బండపై ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మహబూబ్‌నగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
mahabubnagar
Woman
Suicide
illegal marital affair

More Telugu News