బాబూ లోకాయ్‌.. ఆ డబ్బు నువ్వు తిన్నావా? మీ నాన్న తిన్నాడా? విజయసాయిరెడ్డి

19-07-2020 Sun 10:41
  • సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్‌ కంపెనీలు అనరు  
  • కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్
  • రూ.2,000 కోట్ల డబ్బు  లాగేశారని ఐటీ ప్రకటించింది
  • ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి కారణం అదేనా?
vijaya sai reddy fires on lokesh

టీడీపీ నేత నారా లోకేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేశ్ చేసిన ట్వీట్ల స్ర్కీన్ షాట్లను పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. 'బాబూ లోకాయ్‌... స్టాన్‌ఫర్డ్‌, కార్నెగీల్లో చదువుకున్నానని అంటావ్.. సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్‌ కంపెనీలు అనరు నాయనా. కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్‌' అని ఎద్దేవా చేశారు.

'లోకాయ్‌... మీ నాన్న పీఎస్‌ ఇంటి మీద రైడ్ తర్వాత, 2,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు అక్రమ మార్గాల్లో లాగేశారన్న నిజాన్ని ఐటీ శాఖ ప్రకటించింది. మొన్న ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి అసలు కారణం అదేనా? ఆ 2,000 కోట్లు నువ్వు తిన్నావా, మీ నాన్న తిన్నాడా? లేక జాయింట్‌ అకౌంటా?' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.