సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

19-07-2020 Sun 10:13
  • గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి
  • సింహాచలంలో మూడు ఆవులు చనిపోయాయి
  • ఆర్థిక ఇబ్బందులు వల్లే ఈ పరిస్థితి
  • తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల వంద ఆవుల మృతి  
raghurama krishnam raju writes letter to  jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోశాలల ఏర్పాటు కమిటీకి జీవో ఇచ్చారని ఆయన తెలిపారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ కమిటీలు వేయలేదని చెప్పారు.

గత ఏడాది సింహాచలంలో మూడు ఆవులు చనిపోయాయని, ఆర్థిక ఇబ్బందులు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రఘురామకృష్ణరాజు తెలిపారు. తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల వంద ఆవులు మృతి చెందాయని ఆయన చెప్పారు. అన్ని వర్గాలతో కలిపి గోశాలల అభివృద్ధికి కమిటీలు వేయాలని ఆయన సూచించారు. ఆవులు, దూడల సంరక్షణ అంశం హిందువుల నమ్మకానికి సంబంధించిందని అన్నారు.