Chandrababu: ఎస్సీ, ఎస్టీ, బీసీలను చంద్రబాబు మోసం చేశారు: అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ

Chetti Phalguna targets Chandrababu
  • చంద్రబాబు గిరిజనుల ద్రోహి
  • గిరిజనుల ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నించారు
  • గిరిజనుల జీవితాలను జగన్ మార్చేస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గిరిజనుల ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. బాక్సైట్ పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ముఖ్యమంత్రి జగన్ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. గతంలో గిరిజనులకు భూమి పట్టాలను దివంగత వైయస్ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు జగన్ నాలుగింతల భూమి పట్టాలను ఇచ్చి గిరిజనుల జీవితాలను మార్చేస్తున్నారని చెప్పారు.
Chandrababu
Telugudesam
chetti Phalguna
YSRCP

More Telugu News