Ram Gopal Varma: 'పవర్ స్టార్' ట్రైలర్ చూడాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే... రేటు ఫిక్స్ చేసిన వర్మ

Ram Gopal Varma says viewers must pay to watch Power Star movie trailer
  • కరోనా కాలంలోనూ సినిమాలు తీస్తున్న వర్మ
  • తన సొంత ప్లాట్ ఫామ్ పై ప్రదర్శన
  • ట్రైలర్ కు రూ.25 చెల్లించాలని వెల్లడి
కరోనా మహమ్మారితో తక్కిన ప్రపంచమంతా పోరాడుతూ ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. తన సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ డాట్ కామ్ అనే వేదికపై పే పర్ వ్యూ ప్రాతిపదికన ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, తన మార్కును చూపిస్తూ ఈ సినిమా ట్రైలర్ కు కూడా రేటు నిర్ణయించారు. రూ.25 చెల్లిస్తేనే ట్రైలర్ చూసే వీలుంటుందని స్పష్టం చేశారు. చరిత్రలో ఇలాంటి విధానం తొలిసారి అని తెలిపారు. పాతిక రూపాయలు కేవలం ట్రైలర్ కోసమేనని, సినిమా మొత్తం చూడాలంటే మరో రేటు ఉంటుందని స్పష్టం చేశారు.

అంతేకాదు, పవర్ స్టార్ సినిమా చూసేందుకు వర్మ ప్రేక్షకులకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. జూలై 25వ తేదీ ఉదయం 11 గంటల వరకు పవర్ స్టార్ సినిమాకు రూ.150 చెల్లిస్తే సరిపోతుందని, జూలై 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రూ.250 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అందుకే విడుదల వరకు ఆగకుండా ముందే బుక్ చేసుకుని రూ.100 ఆదా చేసుకోండి అంటూ వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు.

Ram Gopal Varma
Power Star
Trailer
Movie
Pay Per View
Lockdown
Corona Virus

More Telugu News