యాక్షన్ హీరోతో మారుతి ప్రాజక్ట్

18-07-2020 Sat 16:52
  • ప్రస్తుతం 'సీటీమార్' చిత్రం చేస్తున్న గోపీచంద్ 
  • అల్లు అర్జున్ తో ఓకే కాని మారుతి ప్రాజక్ట్
  • వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్
Maruti to direct Gopichand

కొత్తతరహా కథలతో సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న దర్శకుడు మారుతి తన తాజా చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రస్తుతం 'సీటీమార్' చిత్రంలో నటిస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ తో ఆయనీ చిత్రాన్ని చేయనున్నట్టు తాజా సమాచారం. వాస్తవానికి మారుతి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయాలని గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన కోసం కథను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే, ఎందుకోగానీ బన్నీతో ఆ ప్రాజక్టు ప్రస్తుతానికి ఓకే కాలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల గోపీచంద్ ని కలసి మారుతి కథ చెప్పాడనీ, నచ్చడంతో ఈ ప్రాజక్టు చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ అంటున్నారు. ఈ చిత్రం ఏ బ్యానర్లో నిర్మాణం జరుపుకుంటుందన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. ఇక గోపీచంద్ త్వరలో తేజ దర్శకత్వంలో 'అలుమేలుమంగ వేంకటరమణ' చిత్రంలో నటించనున్నాడు. దాని తర్వాత మారుతి సినిమా సెట్స్ కి వెళ్లచ్చు!