సీబీఐకి, వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది: బుద్ధా వెంకన్న

18-07-2020 Sat 16:09
  • వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
  • నేడు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
  • అల్లుడికి, మామకు ఖైదు తప్పేలా లేదంటూ బుద్ధా వ్యంగ్యం
Buddha Venkanna responds after CBI starts enquiry into Viveka murder

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. సీబీఐకి, వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. 'బాత్రూంలో బాబాయ్ కేసులో సీబీఐ విచారణ మొదలెట్టేసినాది' అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇక అల్లుడికి, మామకు మరోసారి ఖైదు తప్పదని ఎద్దేవా చేశారు. కాగా, ఏడాది కిందట జరిగిన వివేకా హత్య కేసులో హంతకులెవరో నేటికీ తేలలేదు. ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నేడు సీబీఐ అధికారులు కడపలో దర్యాప్తు షురూ చేశారు.