Vijay Sai Reddy: వచ్చే ఏప్రిల్ 14 నాటికి బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ పార్కు సిద్ధం: విజయసాయిరెడ్డి

 Vijayasai Reddy says Ambedkar Park will be completed in next year
  • ఎస్సీ, ఎస్టీలకు విశేషంగా లబ్ది చేకూరుతోందని వెల్లడి
  • వేల కోట్లతో పథకాలు వర్తింపజేస్తున్నారన్న విజయసాయి
  • ఈసారి విజయవాడలోనే అంబేద్కర్ జయంతి వేడుకలు
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 77 లక్షల మంది ఎస్సీలకు రూ.15.7 వేల కోట్లు, 25 లక్షల మంది ఎస్టీలకు రూ.5 వేల కోట్లకు పైగా పథకాలు వర్తింపజేస్తున్నారని వివరించారు. వచ్చే ఏప్రిల్ 14 నాటికి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ పార్కు సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈసారి ఆ మహనీయుని జయంతిని అక్కడే జరుపుకుందామని పిలుపునిచ్చారు.
Vijay Sai Reddy
Ambedkar Park
Vijayawada
Andhra Pradesh

More Telugu News