అత్యంత నిరాడంబరంగా బ్రిటన్ యువరాణి వివాహం!
- ఎడోర్డో మేపిలీ మోజీతో వివాహం
- రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ లో వివాహం
- వెల్లడించిన రాజ కుటుంబం
ఈ విషయాన్ని వెల్లడించిన బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు, కొత్త జంటకు పలువురు రాజ వంశీయులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా, వీరిద్దరి వివాహం మే 29న లండన్, సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరిపించేందుకు పెద్దలు నిశ్చయించగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో, అప్పట్లో వారి వివాహం వాయిదా పడింది. దాని తరువాత, మరో తేదీని నిర్ణయించిన పెద్దలు వివాహాన్ని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద నిర్వహించారని, వారిద్దరూ ఒకటయ్యారని రాజ కుటుంబం ఓ ప్రకటనలో వెల్లడించింది.