సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

18-07-2020 Sat 07:56
  • ప్రభాస్ తదుపరి చిత్రంలో కియరా అద్వానీ 
  • బాలకృష్ణ, బోయపాటి చిత్రం అప్ డేట్ 
  • విక్రమ్ సరసన మాళవిక మోహనన్ 
Kiara Advani opposite Prabhas in his next

*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా పలువురుని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం కియరా అద్వానీని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిన సంగతి విదితమే. తదుపరి షూటింగును సెప్టెంబర్ నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ వరకు నిర్విరామంగా నిర్వహించే షూటింగుతో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.
*  తమిళ స్టార్ హీరో విక్రమ్ కథానాయకుడుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా మాళవిక మోహనన్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. విశేషం ఏమిటంటే, ఇందులో విక్రమ్ తనయుడు ధృవ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తాడట.