Bharat Biotech: కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ పై భారత్ బయోటెక్ ప్రకటన

  • ఈ నెల 15న తొలి దశ ప్రారంభించినట్టు వెల్లడి
  • 375 మందిపై ప్రయోగాలు
  • దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్
Bharat Biotech announces that they launched clinical trials across the country

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. కోవాగ్జిన్ పేరిట కరోనాకు వ్యాక్సిన్ రూపొందిస్తున్న భారత్ బయోటెక్ సంస్థ దీనిపై తాజాగా ప్రకటన చేసింది. ఈ నెల 15న కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభించామని వెల్లడించింది. ఈ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో 375 మంది పాలుపంచుకుంటున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ షురూ అయ్యాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించింది. దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ కు ఎంతో గుర్తింపు లభిస్తోంది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశను విజయవంతంగా పూర్తిచేసుకుంటే వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. భారత్ బయోటెక్ హైదరాబాద్ కు చెందిన సంస్థ అని తెలిసిందే.

More Telugu News