Rajinikanth: కొత్త పార్టీ పేరును ప్రకటించడానికి సిద్ధమవుతున్న సూపర్‌స్టార్ ర‌జనీకాంత్

rajnikant to be announced party name
షార్ట్స్‌లో చూడండి
తాను రాజకీయాల్లోకి వస్తానని సినీనటుడు రజనీకాంత్ ప్రకటించి చాలా రోజులవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని ప్రకటించడానికి ఆయన చాలా కాలంగా ఆలస్యం చేశారు. ప్రస్తుతం తన పార్టీ పేరును ప్రకటించడానికి కూడా అదే రీతిలో ఆలస్యం చేస్తున్నారు. అయితే, ఆయన రాజ‌కీయపార్టీ పేరును ప్రకటించడానికి ఇప్పుడు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాదిలోనే ర‌జనీ త‌న రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టిస్తార‌ని మొదటి నుంచి వార్త‌లు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆయన ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. మార్చి 12వ తేదీనే పార్టీని ప్రారంభిద్దామని రజనీ భావించారని, క‌రోనా ప్రభావంతో వాయిదా వేశారని ర‌జ‌నీ స‌న్నిహితుడు తియగరాజన్ తెలిపారు.

వచ్చేనెలలో పార్టీని ప్ర‌క‌టిద్దామని కూడా రజనీ భావించారని, అయితే, కరోనా ఇప్పట్లో పోయేలా లేకపోవడంతో మరింత ఆలస్యం జరిగే అవకాశాలూ లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ ఏడాది నవంబ‌ర్‌లో పార్టీ పేరును ప్రకటించాలా? అన్న అంశాన్ని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ శివ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాతై అనే సినిమాలో నటిస్తున్నారు.
Go Back to Shorts
Rajinikanth
Tamilnadu

More Telugu News