మరో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
- జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా సాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
- నాగ్‌నాడ్‌లో ఈ ఉదయం ఎన్‌కౌంటర్
- ఈ ఏడాది ఇప్పటి వరకు 131 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 131 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.