పెరిగిన వరద... పది రోజుల్లో నిండనున్న శ్రీశైలం జలాశయం!

17-07-2020 Fri 08:25
  • 78,889 క్యూసెక్కుల వరద
  • 41 టీఎంసీలకు పెరిగిన నీరు
  • ఆల్మట్టిలోకి 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
Flood for Srisailam

ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల, నారాయణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారగా, శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. ఈ ఉదయం శ్రీశైలానికి వస్తున్న వరద 78,889 క్యూసెక్కులకు చేరింది. ఇదే వరద కొనసాగితే పది రోజుల్లోనే జలాశయం నిండుతుందని అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ లో ప్రస్తుతం 41 టీఎంసీల నీరుంది.

 కాగా, కర్ణాటకలోని ఆల్మట్టిలోకి 27 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, సాధ్యమైనంత ఎక్కువ ఖాళీ ఉంచాలన్న ఉద్దేశంతో 46 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భీమా నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోనే వరద పెరిగిందని అధికారులు అంటున్నారు.