Deepika Padukone: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Deepika Padukone demands huge amount for Prabhas movie
  • భారీ మొత్తాన్ని అడుగుతున్న దీపిక!   
  • దుల్ఖర్ తెలుగు చిత్రానికి డేట్స్ సమస్య
  • 'రాధే శ్యామ్' కోసం 15 కోట్లతో సెట్  
*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్న విషయం విదితమే. ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామ దీపిక పదుకొనేను సంప్రదిస్తున్నారు. అయితే, ఇంతరవరకు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ తీసుకోని స్థాయిలో భారీ పారితోషికాన్ని దీపిక డిమాండ్ చేస్తోందట. దాంతో ఆమె ఎంపిక ప్రస్తుతానికి ముందుకి కదలడం లేదని సమాచారం.
*  దుల్ఖర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో దుల్ఖర్ చేస్తున్న ఇతర సినిమాలు ఆగిపోవడంతో ఇప్పుడీ చిత్రానికి ఆయన  డేట్స్ కేటాయించలేకపోతున్నాడట. దాంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.  
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగుకి సంబంధించి యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించే భారీ సెట్ ను హైదరాబాదులో వేస్తున్నారు. దీనికి సుమారు 15 కోట్లు ఖర్చవుతున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇందులో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
Deepika Padukone
Prabhas
Dulkhar Salman
Pooja Hegde

More Telugu News