ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన కార్తికేయ, ఈషాకు కృతజ్ఞతలు: చిరంజీవి

16-07-2020 Thu 13:30
  • కరోనాపై ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్న చిరంజీవి
  • మాస్కుల ప్రాధాన్యతపై తాజాగా వీడియోల విడుదల
  • ఇందులో పాలుపంచుకున్న కార్తికేయ, ఈషాలపై ప్రశంస
Chiranjeevi thanks Kartikeya and Eesha Rebba

కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యాన్ని పెంచేందుకు మెగాస్టార్ చిరంజీవి తొలి నుంచి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పలు వీడియోల ద్వారా జనాల్లో ఆయన అవగాహన తీసుకొచ్చేందుకు యత్నించారు. తాజాగా మాస్కుల ప్రాధాన్యత గురించి వివరించే ప్రయత్నాన్ని ఆయన చేశారు.

మీసాలు మెలేయడం ఒకప్పుడు వీరత్వమని... ఇప్పుడు మాస్కులు ధరించడం వీరుడి లక్షణమని పేర్కొంటూ వీడియో రూపంలో చిరంజీవి సందేశాన్ని ఇచ్చారు. చిరునవ్వు ముఖానికి చాలా అందమని... ఇప్పుడు ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే ముఖానికి మాస్క్ ధరించడం చాలా ముఖ్యమని మరో వీడియోలో మెసేజ్ ఇచ్చారు.

ఈ వీడియోలలో హీరో కార్తికేయ, హీరోయిన్ ఈషా రెబ్బ నటించారు. ఈ సందర్భంగా వీరిద్దరిపై చిరు ప్రశంసలు కురిపించారు. ఆలోచనను పంచుకోగానే ముందుకొచ్చిన కార్తికేయ, ఈషాలకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.