Chiranjeevi: ఈ సారి హీరోయిన్ ఈషా రెబ్బ లిప్‌స్టిక్‌ సీన్‌.. అన్నిటి కన్నా మాస్కులు ముఖ్యమంటూ చిరు వీడియో

Thank you ActorKartikeya YoursEesha
  • మాస్కుల ప్రాధాన్యత గురించి తెలుపుతూ వీడియో
  • ఇప్పటికే కార్తికేయతో తీసిన వీడియో  పోస్ట్
  • ఇప్పుడు ఈషా రెబ్బతో మరో వీడియో
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా మాస్కుల ప్రాధాన్యత గురించి తెలుపుతూ మెగాస్టార్‌ చిరంజీవి కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా మాస్కులు ధరించాలని చెప్పారు.

ఇప్పటికే కార్తికేయతో తీసిన వీడియోను పోస్ట్ చేసిన చిరంజీవి..  హీరోయిన్ ఈషా రెబ్బతోనూ నటించిన మరో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో హీరోయిన్‌ లిప్‌స్టిక్‌ పెట్టుకుంటోంది. అయితే, అదే సమయంలో చిరు ఎంట్రీ ఇచ్చి.. 'చిరునవ్వు ముఖానికి అందం.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిరునవ్వు కలకాలం నిలవాలంటే మాస్కును ధరించడం ముఖ్యం' అని చెప్పారు.

 కాగా, ఈ స్ఫూర్తిమంతమైన వీడియోలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చిరుకి ఈషా రెబ్బ థ్యాంక్స్‌ చెప్పింది.
Chiranjeevi
Tollywood

More Telugu News