'ఫీల్ ద థండర్'... మహేశ్ బాబు పర్సనల్ జిమ్ ఇది!

16-07-2020 Thu 10:18
  • ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే మహేశ్
  • ఆరోగ్యం కోసం ప్రత్యేక జిమ్
  • శిక్షకుడి ఆధ్వర్యంలో కఠిన వ్యాయామాలు
Mahesh babu Presonal jim Video

తాను నటించే పాత్ర స్వరూపం, స్వభావాలను బట్టి ఆ రూపంలోకి పరకాయ ప్రవేశం చేసే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సిక్స్ ప్యాక్ లో కనిపించి ఫైట్ చేసినా, కాలేజ్ స్టూడెంట్ గా అమ్మాయిల హృదయాలను దోచినా, మహేశ్ కు మహేశే సాటి.

వయసుతో సంబంధం లేకుండా అందాన్ని పెంచుకుంటూ వెళుతున్న ఈ సూపర్ స్టార్, తన ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా జిమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఓ శిక్షకుడి ఆధ్వర్యంలో కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. దీనికోసం ఇంట్లోనే అత్యాధునిక పరికరాలతో జిమ్ ఉండగా, దాని విశేషాలతో కూడిన వీడియోను మహేశ్ భార్య నమ్రత, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 'ఫీల్ ది థండర్' అని క్యాప్షన్ పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది.