తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది: నారా లోకేశ్

16-07-2020 Thu 10:06
  • గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారు
  • మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో డబ్బు పట్టుబడింది
  • అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?
  • ట్విట్టర్ లో లోకేశ్ విమర్శలు
Lokesh Setires on Jagan Govt in Twitter

పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుంటూ, గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారుకు, ఇక్కడి నుంచి పోతున్న డబ్బులను మాత్రం పట్టుకునే దమ్ము లేకపోయిందని టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత బాలినేని స్టిక్కర్ తో ఉన్న కారులో డబ్బు పట్టుబడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు.

"వైఎస్ జగన్ గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది" అని అన్నారు. ఆ తరువాత "ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?" అని ప్రశ్నించారు.