ముద్రగడ వ్యాఖ్యలు బాధించాయి: కాపు జేఏసీ నేత ఆకుల

16-07-2020 Thu 06:46
  • కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల లేఖ
  • కాపు జాతి కోసం ఆయన ఎన్నో చేశారన్న రామకృష్ణ
  • అకస్మాత్తుగా తప్పుకోవడం బాధిస్తోందని వ్యాఖ్య
Akula Ramakrishna Responds about Mudragada decision

కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానంటూ ముద్రగడ పద్మనాభం ఇటీవల రాసిన లేఖ పెను సంచలనమైంది. ఆయన నిర్ణయంపై ఇప్పటికే పలువురు స్పందించగా తాజాగా, కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ స్పందించారు. ఉద్యమం నుంచి తప్పుకుంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలతో తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. కాపు ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని ఆ జాతి కోసం, వారి సంక్షేమం కోసం ముద్రగడ ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. అలాంటి ఆయన ఉద్యమం నుంచి అకస్మాత్తుగా తప్పుకుంటాననడం తనను వేదనకు గురిచేసిందని రామకృష్ణ అన్నారు.