అమరావతి భూకుంభకోణం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సీఐడీ!

15-07-2020 Wed 20:02
  • అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన సురేశ్
  • రికార్డులు తారుమారు చేశారంటూ రిటైర్డ్ తహసీల్దార్ పై ఆరోపణలు
  • ఇద్దరికీ రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
Two arrested by CID in land scam in Amaravati

అమరావతిలో అసైన్ట్ భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలతో గుమ్మడి సురేశ్ అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశాడంటూ విజయవాడకు చెందిన సురేశ్ ను అరెస్ట్ చేశారు. దీనికి తోడు భూ రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ సీఐడీ అధికారులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వీరిని గుంటూరు జైలుకు తరలించారు.