కౌలు రైతులకు రూ. 8,500 కోట్ల రుణాలు: ఏపీ మంత్రి కన్నబాబు
- కౌలు రైతులకు రుణం ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించాం
- పాడి రైతులు, కౌలు రైతులు, జాలర్లకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తాం
- చరిత్రలోనే మొదటిసారి పొగాకు కొనుగోళ్లను ప్రారంభించాం
ఏపీలో అన్ని చోట్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయని... ఈ ఖరీఫ్ సీజన్ చాలా ఆశాజనకంగా ఉందని కన్నబాబు చెప్పారు. సాధారణ స్థాయి కన్నా 51 శాతానికి పైగా వర్షం వచ్చిందని... రిజర్వాయర్లలో కూడా నీటి లభ్యత బాగుందని అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు వల్ల ఈసారి విత్తన సమస్య లేదని అన్నారు. చరిత్రలోనే మొదటిసారి పొగాకు కొనుగోళ్లను ప్రారంభించామని... దీని కోసం రూ. 200 కోట్లను కేటాయించాలని సీఎం ఆదేశించారని చెప్పారు.