కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ

15-07-2020 Wed 19:32
  • తిరుపతిలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • బర్డ్ ఆసుపత్రిలో కరోనా సేవలు అందించాలని టీటీడీ నిర్ణయం
  • విష్ణు నివాసాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చేందుకు ఆమోదం
TTD takes key decisions due to corona cases

ఏపీలో కరోనా కేసుల విస్తరణ తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,432 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 224 కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుపతిలోనే 135 కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో కోవిడ్ సేవలను అందించాలని నిర్ణయించింది. దీంతోపాటు భక్తులకు వసతి కల్పించే విష్ణు నివాసాన్ని కూడా కోవిడ్ సెంటర్ గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.