ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

15-07-2020 Wed 18:47
 • 25 జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ
 • ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం
 • 9,712 మంది వైద్యుల పోస్టుల భర్తీకి నిర్ణయం
Decisions taken in AP Cabinet meeting

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. కాసేపటి క్రితం ముగిసిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

 • 25 జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు. కమిటీలో సీఎస్, సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్ గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు.
 • 9,712 మంది వైద్యుల పోస్టుల భర్తీకి నిర్ణయం.
 • వైయస్సార్ చేయూత పథకంలో అదనంగా మరో 8.21 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం.
 • ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 2006కి సవరణ.
 • ప్రత్యేక ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
 • పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమానికి ఆమోదం.
 • స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ లో 28 పోస్టులకు కేబినెట్ ఆమోదం.
 • సంప్రదాయేతర కరెంట్ ఉత్పత్తి, ప్రాజెక్టులను ప్రోత్సహించేలా... రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్ పోర్ట్ విధానం 2020కి ఆమోదం.
 • రైతులకు పగటి పూట ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్రాజెక్టులను రూపొందించాలని నిర్ణయం.
 • రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయం. కాలువల విస్తరణ పనులకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు.
 • గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ. 145. 94 కోట్ల విడుదలకు ఆమోదం.
 • గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ఆమోదం.
 • ఏపీ ఆర్ఎస్డీఎంపీసీఎల్ కు ఆమోదం. కేపిటల్ లేఔట్ కు రూ. 40 వేల కోట్ల కేటాయింపు.