12 మాస్కులు ధరిస్తూ వీడియో పోస్ట్ చేసిన సినీ నటి!

15-07-2020 Wed 11:18
  • ఒకదాని తర్వాత మరొక మాస్కు ధరించిన సోనాక్షి సిన్హా 
  • 'న్యూ మాస్క్ హూ దిస్' అని పేర్కొన్న నటి
  • అందరూ మాస్కులు ధరించాలని పిలుపు
Sonakshi Sinha funny video

సినీనటి సోనాక్షి సిన్హా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె ఒకదాని తర్వాత మరొక మాస్కు ధరించింది. పలు రకాల మాస్కులను పెట్టుకుని 'న్యూ మాస్క్ హూ దిస్' అని పేర్కొంటూ ఆమె ఈ వీడియోలన్నింటినీ ఒక్కదానిలో కలిపి పోస్ట్ చేసింది.

ఆ సమయంలో ఆమె నల్లరంగు టీ షర్టు ధరించి ఉంది. ఆమె 12 రకాల రంగురంగుల మాస్కులు ధరించింది. ఈ మాస్కులన్నీ ధరిస్తోన్న సమయంలో బ్యాక్ డ్రాప్ లో కరోనా వైరస్ మాస్క్ ఆన్ పాటను కూడా సోనాక్షి యాడ్ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని ఆమె కోరింది.

'మాస్క్ ఆన్.. కరోనా ఆఫ్' అని ఆమె అన్నారు. మాస్కులు ధరిస్తూ, ఇంట్లో ఉంటూ కరోనాకు దూరంగా ఉండాలని చెప్పింది. ఆమె పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో షూటింగులు లేక ఇంట్లోనే ఉంటోన్న సినీనటులు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.