సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

15-07-2020 Wed 07:33
  • కమల్ సినిమాలో కీర్తి సురేశ్ 
  • వెబ్ సీరీస్ లోకి శ్రీను వైట్ల 
  • పారితోషికం తగ్గించుకున్న విజయ్ 
Kerti Suresh in Kamala Hassans movie

*  కమలహాసన్, గౌతమ్ మీనన్ ల కలయికలో గతంలో వచ్చిన 'వెట్టయాడు విలైయాడు' (తెలుగులో 'రాఘవన్') చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన కథానాయికగా అనుష్క నటిస్తుందని వార్తలొస్తున్నాయి. అలాగే మరో ముఖ్య పాత్రలో కీర్తి సురేశ్ కూడా నటిస్తుందన్నది తాజా సమాచారం.
*  ఒకప్పుడు వరుస విజయాలను ఇచ్చి, గత కొంతకాలంగా వెనుకపడిపోయిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల త్వరలో వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఓటీటీ ప్లాట్ ఫాంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
*  తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో సినిమా రంగం నష్టపోయిన నేపథ్యంలో ఈ చిత్రానికి తన పారితోషికాన్ని విజయ్ బాగా తగ్గించుకున్నాడట.