'లవ్ మాక్ టైల్' తెలుగు రీమేక్ లో తమన్నా!

14-07-2020 Tue 21:39
  • కన్నడలో హిట్టయిన 'లవ్ మాక్ టైల్'
  • సత్యదేవ్ సరసన కథానాయికగా తమన్నా
  • నూతన దర్శకుడు నాగశేఖర్ పరిచయం
Thamanna in Telugu remake of Kannada film Love Mocktail

నిన్నటి వరకు టాలీవుడ్ లో అగ్ర కథానాయికలలో ఒకరుగా రాణించిన మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు ఇటీవల సినిమాలు తగ్గాయనే చెప్పాలి. కొత్త హీరోయిన్ల తాకిడితో సీనియర్లకు అవకాశాలు తగ్గుతున్నాయి. దాంతో ప్రస్తుతం తెలుగులో ఆమె ఒకేఒక ('సీటీమార్') చిత్రంలో నటిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా మరో చిత్రానికి ఆమె సంతకం చేసింది. ఇటీవల కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి తమన్నా ఓకే చెప్పింది. ఇందులో '47 డేస్' ఫేం సత్యదేవ్ హీరోగా నటిస్తాడు. నూతన దర్శకుడు నాగశేఖర్ దీనికి దర్శకత్వం వహిస్తారు.  

రొమాంటిక్ మ్యూజికల్ గా రూపొందిన 'లవ్ మాక్ టైల్' కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న దర్శకుడు నాగశేఖర్ రీమేక్ హక్కులను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తాడు.