ముంబై ట్రాఫిక్ కు ఈ వాహనాలే కరెక్ట్: ఆనంద్ మహీంద్రా

14-07-2020 Tue 17:39
  • డిఫెన్స్ కోసం ప్రత్యేక వాహనాలను తయారు చేసిన మహీంద్రా సంస్థ
  • మందు పాత్రల నిర్మూలన కోసం తయారైన వాహనాలు
  • ఫొటోలను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Thinks This Vehicle Would Be Perfect For Mumbai Traffic

ఇండియాలో బెంగళూరు తర్వాత అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే నగరం ముంబై. ఎప్పుడు చూసినా రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. ముంబైలో ప్రయాణాలకు చాలా సమయం పడుతుంటుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు. తన సంస్థ రక్షణరంగం కోసం చేసిన ప్రత్యేక వాహనం యొక్క ఫొటోలను షేర్ చేశారు. సైనికులు సురక్షితంగా ఉండేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. ముంబై ట్రాఫిక్ లో నడిపేందుకు అనువుగా ఉంటాయని చలోక్తి విసిరారు.

మందు పాతరలను వెలికి తీసేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యం ఈ వాహనాలను వినియోగించనుంది. ఈ వాహనాల గురించి ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు.