Vijay Sethupathi: అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి

Vijay Sethupathi reveals the reason for coming out from Pushpa movie
  • కాల్షీట్ల సమస్య వల్లే సినిమా నుంచి తప్పుకున్నాను
  • సుకుమార్ ను వ్యక్తిగతంగా కలిసి పరిస్థితిని వివరించా
  • తన వల్ల షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే, సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పలు వార్తలు ప్రచారమయ్యాయి. భారీ రెమ్యునరేషన్ తో పాటు పలు డిమాండ్లను పెట్టడం వల్లే ఆయనను సినిమా నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ అంశంపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. తాను 'పుష్ప' సినిమాను చేయడం లేదనే వార్తలో నిజం ఉందని ఆయన చెప్పారు. కాల్షీట్ల సమస్య వల్లే సినిమా నుంచి తాను తప్పుకున్నానని తెలిపారు. సుకుమార్ ని వ్యక్తిగతంగా కలిసి తన కాల్షీట్ల సమస్య గురించి చెప్పానని వెల్లడించారు. డేట్ల సమస్య కారణంగా సినిమా షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.
Vijay Sethupathi
Pushpa Movie
Allu Arjun
Sukumar
Tollywood

More Telugu News