Entrance Tests: ఏపీలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా... త్వరలో కొత్త తేదీలు

All entrance tests in AP postponed

  • ఎంసెట్ సహా 8 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేశ్ వెల్లడి
  • సెప్టెంబరు మూడో వారానికి వాయిదా
  • విద్యార్థులకు మాక్ టెస్టులు

కరోనా దెబ్బకు ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఎంసెట్, లా సెట్, ఈ సెట్, పీజీ సెట్ సహా 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ఎంట్రన్స్ టెస్టులను సెప్టెంబరు మూడో వారానికి వాయిదా వేస్తున్నట్టు వివరించారు. త్వరలోనే ప్రవేశ పరీక్షల కొత్త తేదీలతో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి సురేశ్ తెలిపారు. అయితే, విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే జాతీయస్థాయిలో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డ విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News