ఇంగ్లాండ్ ను వెస్టిండీస్ చిత్తు చేయడంపై కోహ్లీ స్పందన!

13-07-2020 Mon 19:35
  • కరోనా పంజా విసిరిన తర్వాత ప్రారంభమైన క్రికెట్ సందడి
  • తొలి టెస్టులో ఇంగ్లాడ్ పై వెస్టిండీస్ విజయం
  • అత్యద్భుతమైన టెస్ట్ క్రికెట్ అని కితాబిచ్చిన కోహ్లీ
Kohlis reaction on West Indies win on Englan in first test

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా వ్యవస్థ స్తంభించిపోయింది. గల్లీ స్థాయి నుంచి ఐసీసీ టోర్నీల వరకు క్రికెట్ ఆట ఆగిపోయింది. మళ్లీ క్రికెట్ ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందోనని అందరూ సందిగ్ధంలో ఉన్న వేళ... ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్ ప్రారంభమైంది. కరోనా సంక్షోభ సమయంలో ఇరు జట్లు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును కనపరిచాయి.

కరోనా నేపథ్యంలో, కొత్త కోవిడ్ రూల్స్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది. సౌథాంప్టన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ ను విండీస్ నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ లో విండీస్ 1-0 లీడ్ ను సాధించింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ పై ప్రశంసలు కురిపించాడు. 'వావ్ వెస్టిండీస్... వాటే విన్. అత్యద్భుతమైన టెస్ట్ క్రికెట్' అని ట్వీట్ చేశాడు.