ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన శర్వానంద్

13-07-2020 Mon 16:23
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన శర్వా
  • టీఆర్ఎస్ నేతలతో కలిసి జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన వైనం
  • కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్
Sharwanand planted saplings in GHMC Park

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. హైదరాబాద్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలోని జీహెచ్ఎంసీ పార్క్ లో శర్వా కొన్ని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ నేత దానం నాగేందర్ కూడా పాల్గొన్నారని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరో శర్వానంద్ కు కృతజ్ఞతలు తెలిపారు. శర్వా అభిమానులు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.