చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో రెహ్మాన్!

13-07-2020 Mon 16:04
  • చిరంజీవి హీరోగా 'లూసిఫర్' రీమేక్ 
  • యంగ్ హీరోగా విజయ్ దేవరకొండ
  • ప్రధాన విలన్ పాత్రకు రెహ్మాన్  
Rehman to play villan role in Lucifer remake

చిరంజీవి సినిమాకి విలన్ పాత్రధారిని ఎంపిక చేయడం కూడా కష్టమే. ఎందుకంటే, ఆయన ఇమేజ్ కి, పాప్యులారిటీకి సరితూగే ఆర్టిస్టు దొరకాలి. అందులోనూ కొత్తదనం కనపడాలి. తాజాగా అలాంటి అవకాశం ప్రముఖ నటుడు రెహ్మాన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న చిరంజీవి దీని తర్వాత మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'లో నటించనున్న సంగతి విదితమే.

'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో యంగ్ హీరో పాత్రకి విజయ్ దేవరకొండను తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అలాగే తాజాగా ప్రధాన విలన్ పాత్రకు గాను రెహ్మాన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ పాత్రను పోషించాడు. పోతే, రెహ్మాన్ గతంలో పలు తమిళ సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే తెలుగులో రఘు పేరుతో కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు.