విమాన ప్రయాణాల్లో మరింత వెసులుబాటు.. ఆంక్షలు సడలించిన కేంద్రం

13-07-2020 Mon 09:03
  • రెండు నెలల వ్యవధిని కుదించిన విమానయాన శాఖ
  • ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల్లో తమకు కరోనా సోకలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరి
  • కరోనా నుంచి కోలుకున్న వారికీ వెసులుబాటు
Union govt easing flight journey norms

విమాన ప్రయాణికులకు మరిన్ని సడలింపులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణం చేయాలనుకునే వారు ఇప్పటి వరకు ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో తమకు కరోనా సోకలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం చూపించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడా నిబంధనలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరింత సడలించింది. ప్రయాణ తేదీకి మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా సోకలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందని పేర్కొంది. అలాగే, కరోనా నుంచి కోలుకున్న వారికీ ఈ వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అయితే, వీరు కరోనాకు చికిత్స తీసుకున్నట్టు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది.