Golden Biscuts: తిరుమల శ్రీవారి హుండీలో 20 బంగారు బిస్కెట్లు వేసిన అజ్ఞాత భక్తుడు

  • స్వామివారికి ఖరీదైన కానుకలు
  • ఒక్కో బంగారు బిస్కెట్ బరువు 100 గ్రాములు
  • నెల రోజుల్లో శ్రీవారి ఆదాయం రూ.16.73 కోట్లు
 Unknown devotee offered twenty golden biscuits

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి హుండీ ఎప్పుడూ కాసుల గలగలతో కళకళలాడుతూ ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన శ్రీవారి ఆలయం ఇటీవల పునఃప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓ అజ్ఞాత భక్తుడు స్వామివారికి అత్యంత ఖరీదైన కానుకలు సమర్పించారు.

శ్రీవారి హుండీలో ఆ వ్యక్తి 20 బంగారు బిస్కెట్లు వేశారు. ఒక్కొక్క బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉన్నట్టు గుర్తించారు. అటు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, జూన్ 11 నుంచి జూలై 10 వరకు హుండీ ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని వెల్లడించారు. భక్తుల తలనీలాలతో రూ.7 కోట్ల మేర అదనంగా వచ్చిందని తెలిపారు. తలనీలాల విలువ పెరగడంతో అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

More Telugu News