బాలీవుడ్‌ నటులను వణికిస్తోన్న కరోనా.. అనుపమ్ ఖేర్‌ ఇంట్లో నలుగురికి సోకిన వైనం

12-07-2020 Sun 13:13
  • ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన అనుపమ్‌ ఖేర్
  • తల్లి, సోదరుడు రాజు ఖేర్‌, మ‌ర‌ద‌లు, మేన‌కోడ‌లికి క‌రోనా
  • తనకు నెగెటివ్ వచ్చిందన్న అనుపమ్‌
This is to inform all that my mother Dulari is found Covid says anupam

బాలీవుడ్ నటులను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా, అనుప‌మ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. తన తల్లి దులారి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోందని, దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ల‌డంతో కరోనా ఉన్న‌ట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.

ఆమెలో క‌రోనా ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉన్నాయని అనుపమ్ ఖేర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఆమెకు ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అనంతరం తన సోదరుడు రాజు ఖేర్‌, మ‌ర‌ద‌లు, మేన‌కోడ‌లుకి కూడా క‌రోనా నిర్ధార‌ణ అయిందని చెప్పారు. ప్రస్తుతం నలుగురి  ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని చెప్పారు.

బీఎంసీ అధికారులతో పాటు వైద్యులు తమకు  సహ‌క‌రించారని అనుపమ్ ఖేర్ తెలిపారు. తాను కూడా కరోనా ప‌రీక్ష చేయించుకున్నానని,  నెగెటివ్ అని తేలిందని వివరించారు. ప్ర‌స్తుతం తాము హోం క్వారంటైన్‌లో ఉన్నామని, తన సోద‌రుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారని ఆయన వివరించారు.