మరోసారి 'మైండ్ బ్లాంక్' చేసేసిన టాలీవుడ్ ప్రిన్స్!

12-07-2020 Sun 06:00
  • 10 కోట్ల వ్యూస్ సాధించిన సాంగ్
  • తొలుత అదే క్లబ్ లో 'బుట్టబొమ్మా..' పాట
  • ఈ సంవత్సరం సూపర్ హిట్ గా నిలిచిన రెండు పాటలు
Mahesh Babu Mind Blank Song Hits 100 Miollion Mark

టాలీవుడ్ ప్రిన్స్  మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలై, సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన డ్యాన్స్ తో మహేశ్ బాబు, అభిమానుల మైండ్ ను బ్లాంక్ చేశాడనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 'మైండ్ బ్లాంక్', 'ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీహై' పాటలు సినీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా 'మైండ్ బ్లాంక్' సాంగ్ యూ ట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్ సాధించింది.

ఈ సంవత్సరం టాలీవుడ్ లో హిట్ అయిన పాటల్లో 'బుట్టబొమ్మా... బుట్టబొమ్మా' సాంగ్ తొలుత ఈ ఘనతను అందుకోగా, ఇప్పుడు మహేశ్ సాంగ్ కూడా అదే క్లబ్ లో చేరింది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ నృత్యాలను సమకూర్చారన్న సంగతి తెలిసిందే.