Corona Virus: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ... కొత్తగా 1,178 మందికి పాజిటివ్

 Corona looming over Telangana as new cases increased
  • జీహెచ్ఎంసీ పరిధిలో 736 కొత్త కేసులు
  • 33 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
  • తాజాగా 9 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. కొత్తగా 1,178 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,402కి చేరింది. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 736 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101 కేసులు వచ్చాయి. తాజాగా మరో 9 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 348కి పెరిగింది. ఇవాళ 1,714 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,135 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Telangana
Positive
Deaths
COVID-19

More Telugu News