Guddan Trivedi: వికాస్ దూబే నమ్మినబంటును ముంబయిలో పట్టుకున్న పోలీసులు

Vikas Dubey close aide Guddan Trivedi arrested in Mumbai
  • పోలీసులను చంపిన తర్వాత పారిపోయిన గుడ్డాన్
  • ముంబయిలో తిరుగుతుండగా అరెస్ట్
  • వికాస్ దూబేతో కలిసి అనేక నేరాలకు పాల్పడిన గుడ్డాన్
తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను పక్కా ప్లాన్ తో బలి తీసుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కథ పోలీసు తూటాతో ముగియగా,  మరో ఐదుగురు అనుచరులను కూడా పోలీసులు మట్టుబెట్టారు. ఈ క్రమంలో, వికాస్ దూబే నమ్మినబంటుగా పేరుపొందిన అరవింద్ అలియాస్ గుడ్డాన్ త్రివేది కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. కాన్పూర్ సమీపంలోని భిక్రు గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను చంపిన అనంతరం గుడ్డాన్ త్రివేది ముంబయి పారిపోయాడు.

తాజాగా సురక్షితమైన స్థావరం కోసం అన్వేషిస్తుండగా, ముంబయి ఏటీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. గుడ్డాన్ డ్రైవర్ సోను తివారీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ దూబేతో కలిసి గుడ్డాన్ అనేక నేరాల్లో పాలుపంచుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. 2001లో రాష్ట్ర మంతి సంతోష్ శుక్లా హత్యకేసులోనూ వికాస్ దూబేతో కలిసి గుడ్డాన్ నిందితుడని గుర్తించారు. గుడ్డాన్ అరెస్ట్ పై ముంబయి ఏటీఎస్ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, గుడ్డాన్ త్రివేది.. తన బాస్ వికాస్ దూబేతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో గుడ్డాన్... సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Guddan Trivedi
Vikas Dubey
Arrest
Mumbai
Uttar Pradesh
Police

More Telugu News