నాకు బేడీలు వేసి తీసుకెళ్లండి... ఎన్ కౌంటర్ భయంతో ఓ గ్యాంగ్ స్టర్ వేడుకోలు!

  • గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • భయాందోళనలో ఇతర గ్యాంగ్ స్టర్లు
  • కోర్టును ఆశ్రయించిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్
Gangster Lawrence Bishnoi wants cuffs while going

ఉత్తరప్రదేశ్ లో కరుడుగట్టిన క్రిమినల్ గా పేరుమోసిన వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేయడం ఇతర గ్యాంగ్ స్టర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పోలీసులతో కలిసి ప్రయాణించాలంటే హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్టర్ తనను కూడా ఎన్ కౌంటర్ చేస్తారేమో అని ఆందోళన చెందుతున్నాడు. నకిలీ ఎన్ కౌంటర్ లో తనను చంపే అవకాశం ఉందంటూ చండీగఢ్ కోర్టును ఆశ్రయించాడు. తనను కోర్టుకు తీసుకువచ్చేటప్పుడు, తిరిగి జైలుకు తీసుకెళ్లేటప్పుడు చేతులకు బేడీలు వేసేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును వేడుకున్నాడు. బేడీలు వేయడం వల్ల ఎన్ కౌంటర్ చేసే అవకాశం తక్కువ అని లారెన్స్ భావిస్తున్నాడు. లారెన్స్ బిష్ణోయ్... పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

More Telugu News