వీసా రెడ్డి గారూ... నా భాష మీకు అర్థం కాలేదు: వర్ల రామయ్య

11-07-2020 Sat 20:59
  • వర్ల రామయ్యపై విజయసాయి విమర్శలు
  • ట్విట్టర్ లో బదులిచ్చిన వర్ల రామయ్య
  • అంత అమాయకుల్లా కనిపిస్తున్నామా? అంటూ ప్రశ్న
Varla Ramaiah replies Vijayasai Reddy comments

మాట్లాడితే దళిత నాయకుడివి అంటావు,  అంబేద్కర్ స్మృతివనం నిర్మించాలని జగన్ సర్కారు ప్రతిపాదిస్తే వ్యతిరేకిస్తావు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత వర్ల రామయ్యను ఉద్దేశించి ట్వీట్ చేయడం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన వర్ల రామయ్య... నా భాష మీకు అర్థం కాలేదు వీసా రెడ్డి గారూ అంటూ ట్వీట్ చేశారు. స్వరాజ్ మైదానం కోర్టు వ్యాజ్యంలో ఉందని, అలాంటప్పుడు స్మృతివనానికి ఎలా ఇస్తారని మాత్రమే ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. ఈ వివరాలు తెలియకుండా దళితులను మాయచేస్తే, అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నామా? అంటూ ప్రశ్నించారు.