కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మోదీ

11-07-2020 Sat 18:14
  • కరోనా కట్టడి కోసం అద్భుతంగా పని చేశారు
  • ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి
  • కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
Modi compliments Kejriwal govt

ఢిల్లీలో కరోనాను కట్టడి చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అద్భుత రీతిలో పని చేసిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం, కేజ్రీ  ప్రభుత్వం, స్థానిక అధికారుల సమన్వయంతో పని చేశారని అన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఢిల్లీని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని సూచించారు. ఈరోజు కరోనా పరిస్థితిపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్, నీతిఆయోగ్ సభ్యులు, కేబినెట్ కార్యదర్శి, కేంద్రంలోని ముఖ్యశాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. కరోనా కట్టడికి నిరంతర ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు.