'అసత్యాగ్రహి' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్

11-07-2020 Sat 17:54
  • ఎంపీలో 750 మెగావాట్ల సోలీర్ ప్రాజెక్టును నిన్న ప్రారంభించిన మోదీ
  • ఆసియాలోనే అతి పెద్దదని పీఎంఓ ట్వీట్
  • మోదీని  అసత్యాగ్రహి అని విమర్శించిన రాహుల్
Rahul Gandhi tweets Asatyagrahi

మధ్యప్రదేశ్ లోని రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దదంటూ ప్రధాని మోదీ ప్రకటించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును నిన్న మోదీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ అంటే నర్మదా నది, తెల్ల పులులు గుర్తుకు వచ్చేవని... ఇప్పటి నుంచి ఈ సోలార్ ప్రాజెక్ట్ కూడా గుర్తుకు వస్తుందని పేర్కొంది.

ఈ సందర్బంగా ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ, 'అసత్యాగ్రహి' అని కామెంట్ చేశారు. అసత్యాగ్రహి అంటే సత్యాలు మాట్లాడనివాడు అని అర్థమనే విషయం తెలిసిందే.