నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్

11-07-2020 Sat 15:40
  • ఫ్యాన్ కు ఉరేసుకుంటూ వీడియోలో చిత్రీకరించిన అమ్మాయి
  • కుటుంబ సభ్యులు వచ్చేసరికి మృతి
  • ముగ్గురు యువకుల వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు
Degree student commits suicide in Nellore

నెల్లూరులో బీవీ నగర్ లో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. సెల్ఫీ వీడియో అనంతరం ఆమె తనువు చాలించడం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంటూ వీడియోలో చిత్రీకరించింది. ఈ వీడియోను కుటుంబ సభ్యులు ఆలస్యంగా చూడడంతో అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తలుపులు పగులగొట్టి చూసేసరికి విద్యార్థిని మృతి చెందింది. ముగ్గురు యువకుల వేధింపులే కారణమని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.