దేశంలో 8 లక్షలు దాటేసిన కరోనా కేసులు

11-07-2020 Sat 10:24
  • గత 24 గంటల్లో 27,114 మందికి కొత్తగా కరోనా
  • ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే
  • కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,20,916
  • మృతుల సంఖ్య మొత్తం 22,123
Indias COVID19 case tally crosses 8 lakh mark with 519 deaths and highest singleday

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,20,916కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,123కి పెరిగింది. 2,83,407 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకున్నారు.
                   
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,13,07,002 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,82,511 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.