బీఎస్ఎఫ్‌లో కరోనా బారినపడుతున్న జవాన్లు.. మరో 73 మందికి పాజిటివ్

11-07-2020 Sat 08:37
  • బీఎస్ఎఫ్‌లో మొత్తం 1,659 కరోనా కేసులు
  • ఐటీబీపీలో కొత్తగా 12 మందికి సోకిన కొవిడ్
  • బీఎస్ఎఫ్‌లో కోలుకున్న 927 మంది జవాన్లు
73 more jawans infected to corona virus in BSF

భద్రతా దళాల్లో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీఎస్ఎఫ్‌లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా బారినపడగా, తాజాగా మరో 73 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకింది. దీంతో బీఎస్ఎఫ్‌లో మొత్తం బాధితుల సంఖ్య 1,659కి పెరిగింది.

తాజాగా, 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది. మరోవైపు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లోనూ కొత్తగా 12 మందికి వైరస్ సోకగా, 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఫోర్స్‌లో ఇంకా 178 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 298 మంది కోలుకున్నట్టు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి.